శ్రీవారి అలిపిరి నడక మార్గం మూసివేత! టీటీడీ కీలక నిర్ణయం..
Publish Date:May 26, 2021
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకునే అలిపిరి నడకమార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది. జూన్ 1 నుంచి జులై 31వ తేదీ వరకు అలిపిరి నడకమార్గాన్ని మూసేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. అలిపిరి నడకమార్గానికి ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. అలిపిరి నడకమార్గం పైకప్పు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే ఎంతోమంది భక్తులు నడకమార్గం ద్వారా వెళ్లేందుకు ఇష్టపడతారు. నడకమార్గం ద్వారానే వస్తామని స్వామికి భక్తులు మొక్కుకుంటారు. ఇప్పుడు అలిపిరి మెట్ల మార్గం మూతపడటంతో... అలాంటి భక్తులందరూ శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. హనుమంతుని జన్మస్థలంపై హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌తో టీటీడీ చర్చకు సిద్ధమైంది. గురువారం తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో ఇరుపక్షాల మధ్య చర్చ జరుగతుంది. కిష్కింద ట్రస్ట్ తరపున గోవిందానంద సరస్వతి చర్చలో పాల్గొననున్నారు. టీటీడీ తరపున కమిటీ కన్వీనర్, సభ్యులు చర్చలో పాల్గొననున్నారు. శ్రీరామనవమి రోజున తిరుమలలోని అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా టీటీడీ ప్రకటించింది. టీటీడీ ప్రకటనపై హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యంతరం తెలిపింది. టీటీడీకి పరుష పదజాలంతో ట్రస్ట్ లేఖలు కూడా రాసింది. బహిరంగ చర్చకు రావాలంటూ టీటీడీకి హనుమద్ ట్రస్ట్ సవాల్ విసిరింది. దీంతో గురువారం హనుమంతుని జన్మస్థానంపై ఆధారాలను ఇరుపక్షాలు బయటపెట్టనున్నాయి.
http://www.teluguone.com/news/content/ttd-will-close-alipiri-steps-way-still-july-end-39-116303.html





